చక్కెర ప్రత్యామ్నాయాలు!

15-07-2019: తీపి తినాలనిపిస్తే చక్కెరతో తయారైన పదార్థాలే కాదు, అందుకు ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. ఆరోగ్యకరమైన తీపి ప్రత్యామ్నాయాలను పరిమితంగా తీసుకోగలిగితే, పది కాలాలపాటు ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.
 
బెల్లం, తేనె, తాటి బెల్లం, ఖర్జూరం, తీపి కొబ్బరి... ఇవన్నీ సహజసిద్ధమైన తీపి పదార్థాలే! తీపిని అందిస్తూనే అదనంగా క్యాలరీలు జోడించని ప్రత్యామ్నాయ చక్కెరలు ఇవి. ఒకే పరిమాణంలోని అదనపు చక్కెరలతో పోలిస్తే, సహజ చక్కెరలు శరీరం మీద తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అంతమాత్రాన సహజ చక్కెరలనూ పరిమితికి మించి తినకూడదు. చక్కెర బదులు బెల్లం తినడం ద్వారా ఇనుము, క్యాల్షియం, విటమిన్లు, ఖనిజ లవణాలు మొదలైన పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. కృత్రిమ చక్కెరల వినియోగం కూడా పెరుగుతోంది. నిజానికి ఇవి చక్కెరతో సమానమైన ప్రతికూల ప్రభావాన్నే కలిగిస్తాయి. పళ్లు అందించే తీపి బదులుగా మరే ఇతర తీపి అయినా ఆ పదార్థాలను ఆచి తూచి పరిమితంగా తినాలి. తీపి పూర్తిగా మానేయకుండానే, పరిమితంగా తీసుకున్నంత కాలం ఆరోగ్యంగా ఉంటాం!