పిప్పళ్లు చక్కని ఔషధ గుళికలు

29-08-2017:

ఒక గ్రాము పిప్పళ్ళ చూర్ణానికి, 5 గ్రాముల పాత బెల్లం కలిపి సేవిస్తే, ఉబ్బసం, దగ్గు తగ్గుతాయి.

ఒక గ్రాము పిప్పళ్ళ చూర్ణాన్ని ఆరస్పూను తేనె తో కలిపి తీసుకుంటే ఎసిడిటి తగ్గుతుంది.

అర గ్రాము పిప్పళ్ల చూర్ణాన్ని నీళ్లతో తీసుకుంటే, వాంతులు, విరేచనాలు (డిసెంట్రీ) తగ్గుతాయి.

మట్టి మూకుడులో పిప్పళ్లను దోరగా వేయించి, మెత్తటి చూర్ణం చేసుకుని, మూడు గ్రాముల మోతాదులో ఒక స్పూను తేనెతో తీసుకుంటే, కడుపు ఉబ్బరం సమస్య తగ్గడంతో పాటు ఆకలి పెరుగుతుంది.

పిప్పళ్లు, మోడి, శొంఠి, మిరియాలు సమపాళ్లల్లో కలిపిన చూర్ణాన్ని, 2 గ్రాముల మోతాదులో అరస్పూను తేనెలో కలిపిగానీ, 30 మి.లీ. కషాయంలో ఒక స్పూను తేనె కలిపిగానీ సేవిస్తూ ఉంటే చాలా కాలంగా వేధిస్తున్న జలుబు, బొంగురు గొంతు సమస్యలు తగ్గిపోతాయి.

పిప్పళ్లు, వస సమభాగాలుగా తీసుకుని, మూడు గ్రాముల మోతాదులో వేడినీటితో గానీ, పాలతో గానీ కలిపి రోజూ రెండు పూటలా తీసుకుంటే మైగ్రేన్‌ తగ్గుతుంది.

రెండు గ్రాముల పిప్పలి మూల (మోడి) చూర్ణానికి తేనె కలిపి, రోజుకు మూడు పూటలా సేవిస్తే అధిక బరువు తగ్గుతుంది. అయితే ఈ తీసుకున్న గంటవరకు నీళ్లు తప్ప ఇతర ఆహార మేదీ తీసుకోకూడదు.

ఐదు గ్రాముల పిప్పలి మూల(మోడి) చూర్ణాన్ని అరకప్పు మజ్జిగలో కలిపి రెండు పూటలా సేవిస్తే ప్రసవానంతరం ఎత్తుగా మారిన పొత్తి కడుపు తగ్గిపోయి, పొట్ట చదునుగా అవుతుంది.