అత్యవసర సమయాల్లో...

15-07-2019:హోమియో వైద్యం దీర్ఘకాలం పాటు కొనసాగే వైద్యం, నెమ్మదిగా ప్రభావాన్ని చూపించే చికిత్స అని ఎక్కువమంది నమ్మకం. కానీ హోమియో మందులను కొన్ని అత్యవసర సమయాల్లోనూ వాడుకోవచ్చు.
 
సాధారణ గాయాలు: ఆటలాడేటప్పుడు పిల్లలకు తగిలే దెబ్బలు, వంటింట్లో కాలిన గాయాలు, ప్రయాణాల్లో తగిలే దెబ్బలు ఈ కోవలోకి వస్తాయి. ఈ సందర్భాల్లో జరిగే రక్తస్రావం, మొదలయ్యే నొప్పులు... ఈ రెండింటినీ అదుపు చేయడానికి క్యాలెండ్యులా, అమిక, హైపెరికం మొదలైన హోమియో మందులు వాడుకోవచ్చు.
రక్తస్రావం: సాధారణ దెబ్బల్లో కనిపించే రక్తస్రావం, ముక్కు నుంచి రక్తం కారడం, మూత్రంలో రక్తం కనిపించడం, నెలసరి స్రావం...మొదలైన రక్తస్రావాలకు హోమియోలో చక్కని మందులు ఉన్నాయి. క్యాలెండ్యులా, మిల్లోఫోలియం, హమ్మామాలిస్‌ మొదలైన మందులు ఈ సందర్భాల్లో వాడుకోవచ్చు.
ఇన్‌ఫెక్షన్‌: రుతువుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు, మొటిమలు, తామర, అలర్జీల వల్ల తలెత్తే ఇతర ఇన్‌ఫెక్షన్లకు గన్‌పౌడర్‌, సిలికా హోమియో మందులు వాడుకోవచ్చు.
బెణుకులు: బరువులు ఎత్తేటప్పుడు, తొట్రుపడి పడిపోయి దెబ్బలు తగిలినప్పుడు, బెణుకులు కూడా సహజం. ఆ ప్రదేశాల్లో నొప్పి, వాపు తగ్గాలంటే రూటా, రూస్‌ టాక్స్‌ మందులు వాడాలి.
కాలిన గాయాలు: ఎండ వేడికి చర్మం కందిపోవడం, వంటగదిలో పొయ్యి మంట తగిలి చేతులు కాలడం, టపాసులు పేలినప్పుడు శరీర భాగాలు కాలడం మొదలైన కాలిన గాయాలకు క్యాంథారిస్‌, అర్టికా మొదలైన మందులు వాడవచ్చు.

డాక్టర్‌ బి. అనిల్‌కుమార్‌

హోమియో వైద్య నిపుణులు,
మియాపూర్‌, హైదరాబాద్‌