ఎత్తు పెరగాలంటే?

01-04-2019: ఎత్తు జన్యుపరంగా సంక్రమించే లక్షణమే అయినా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే పిల్లలు కొంతమేరకు ఎక్కువ ఎత్తు పెరిగే వీలుంటుంది. ఆ ఆరోగ్య సూత్రాలు ఇవే!
 గ్రోత్‌ హార్మోన్‌ను ప్రభావితం చేసే పోషకాహారం తినిపించాలి. మరీ ముఖ్యంగా విటమిన్‌ ‘ఎ’ ఎక్కువగా ఉండే పాలు, చేపలు, గుమ్మడి విత్తనాలు, ఆకుపచ్చని కూరగాయలు, చిలకడ దుంపలు, క్యారెట్లు ఆహారంలో చేర్చాలి.
విటమిన్‌ బి1 ఉండే పచ్చి బఠాణీ, చిక్కుళ్లు తరచుగా వండి పెడుతూ ఉండాలి.
 విటమిన్‌ బి2 ఉండే గుడ్లు, పుట్టగొడుగులు, సోయా, బ్రొకొలి, జున్ను తినిపిస్తూ ఉండాలి.
విటమిన్‌ సి కోసం బొప్పాయి, స్ర్టాబెర్రీ, నిమ్మ, టమాటా, ఇతర సిట్రస్‌ పళ్లు అందిస్తూ ఉండాలి.
విటమిన్‌ డి కోసం గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, ఫిష్‌ లివర్‌ ఆయిల్‌ ఇస్తూ ఉండాలి.