హెల్తీ డ్రింక్‌

13-11-2017: సబ్జా....అధిక బరువునూ, అధిక ఉష్ణాన్నీ తగ్గిస్తుంది. బ్లడ్‌ సుగర్‌ మోతాదును అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికీ, కేశ సంరక్షణకూ తోడ్పడుతుంది. దగ్గు, ఫ్లూ, గుండెమంట, ఎసిడిటీలను నివారిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి సబ్జాతో ఈ పానీయాన్ని తయారుచేసుకుని ప్రతిరోజూ తాగండి!

 
కావలసిన వస్తువులు
 
సబ్జా గింజలు - టేబుల్‌ స్పూన్‌, నిమ్మకాయ - 1
పంచదార - 2 టేబుల్‌ స్పూన్‌లు (పావు కప్పు వేడి నీటిలో లేదా తేనెలో క లిపి ఉంచాలి)
ఉప్పు - చిటికెడు, బ్లాక్‌సాల్ట్‌ - అర టీ స్పూన్‌, నీళ్లు - 600 మి. లీ.
 
తయారు చేసే విధానం
తొలుత సబ్జా గింజలను నీటిలో కడిగి, పాత్రలో వేసుకోవాలి. అందులో గోరువెచ్చని నీరు పోసి 30 నిమిషాలు ఉంచితే గింజలు ఉబ్బుతాయి. పైన జిగట లాంటి పదార్థం ఏర్పడుతుంది. మరో పాత్రను తీసుకొని నిమ్మరసం, పంచదార ద్రావణం, ఉప్పు, బ్లాక్‌ సాల్ట్‌, సబ్జా గింజలు, నీరు పోసి బాగా కలియబెట్టాలి. గ్లాసుల్లో ఐస్‌ముక్కలతో కలిపి అందిస్తే రుచి అదిరిపోతుంది.