ప్రయాణంలో... ఆరోగ్యంగా...

23-08-2018: ఇంట్లో ఉన్నప్పుడు ఆహారనియమాలు పాటించడం సులువే. కానీ ఎక్కడికైనా టూర్‌కు వెళ్లినప్పుడు మాత్రం మీ నియమాలకు గండిపడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. దొరికింది తినాల్సిందే. దీని కోసం ప్లానెట్‌ హెర్బ్స్‌సైన్సెస్‌ సంస్థ డైరెక్టర్లు అక్షిత్‌ రంగ్తా, నైనా ట్రెహాన్‌లు చెబుతున్న టిప్స్‌ ఇవే!
ఎంత దూరం వెళుతున్నా మీ డైట్‌ తీసుకెళ్లడానికి ఓ బాక్స్‌ ఉండాల్సిందే. ఆల్మండ్‌ బటర్‌ను ట్రై చేయండి. అందులో చాలా పోషక విలువలు ఉంటాయి. పైగా ఇందులో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలో బీపీ, షుగర్‌, బరువులను నియంత్రిస్తాయి.
జీడిపప్పు నుంచి తయారు చేసే వెన్న కూడా మంచి చాయిస్‌. దీన్నే క్యాష్యూ బటర్‌ అని పిలుస్తారు. సాధారణంగా ఇది స్నాక్‌ ఐటమ్‌గా తినడం చాలా మందికి అలవాటు. ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు గుండెకు చాలా మంచిది. ఇట్టే ఆకలి తీరుతుంది కూడా.
శాండ్‌విచ్‌ అంటే చాలా మంది ఇష్టపడతారు. వీటిని ఓ బ్యాక్స్‌లో తీసుకెళ్లడం కూడా సులువే. ఎక్కువగా పండ్లు, కూరగాయలతో తయారు చేసిన శాండ్‌విచ్‌లు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అంతే కాదు ఎక్కువగా వెల్లుల్లిని మీ శాండ్‌విచ్‌ రుచికి జతచేయండి. అలా చేయడం వల్ల మీరు జలుబు, ఇతర ఎలర్జీల బారిన పడకుండా ఉంటారు.