తలనొప్పికి టాటా..

ఆంధ్రజ్యోతి, 02/07/15: నిద్రలేమి, ఫుడ్‌ హాబిట్స్‌, మానసిక ఒత్తిళ్లు తలనొప్పికి కారణం అవుతాయి. మనం తీసుకునే ఆహారంలోనూ తలనొప్పి కారకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీలోని కెఫిన్‌, పెరుగులోని టైరమైన్‌, పులుపు పదార్థాల్లో ఉండే సిట్రస్‌ తలనొప్పిని రేకెత్తిస్తాయి. మన డైట్‌లో కొద్దిపాటి తేడాలతో తలనొప్పికి ఇట్టే టాటా చెప్పేయొచ్చు.

 
వెన్న, మటన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల తలపోటు పెరుగుతుంది. విటమిన్‌-సి, డి, కాల్షియం, బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలా ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్‌. పోషకాలున్న ఆహారాలతో పాటు, మంచి నిద్ర, కొద్దిపాటి వ్యాయామం వంటివి తలనొప్పిని దూరం చేస్తాయి.
 
ఇలా చెక్‌ పెట్టేయండి.. 
కాసింత రాళ్ల ఉప్పును చేర్చిన పాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి మాయం అవుతుంది. 
ఒక గ్లాసు వేడి నీటిలో కాసింత నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రభావం తొందరగా ఉంటుంది. 
యూకలిప్టస్‌ తైలం తలనొప్పి నివారిణిగా బాగా పని చేస్తుంది. 
గోరువెచ్చని ఆవుపాలు తాగినా హెడెక్‌ నుంచి రిలాక్స్‌ అవ్వొచ్చు. 
చందనాన్ని పేస్ట్‌లా చేసుకుని నుదుటికి అప్లయ్‌ చేసినా మంచి గుణం కనిపిస్తుంది. 
కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను నుదుటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్‌ చేసి చూడండి.. తలనొప్పి తోక ముడుచుకుని పారిపోతుంది. 
నీరు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. 
యాపిల్‌ పండుతో పాటు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకున్నా తలనొప్పి మటుమాయం అవుతుంది. 
ఈసారి తలనొప్పి వచ్చినపుడు ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి. నిమిషాల వ్యవధిలో భరించలేని నొప్పికి గుడ్‌ బై చెప్పేయండి.