ఆరోగ్యానికి తొలిపొద్దు

28-08-2017: పొద్దు తిరుగుడు గింజలను దీని ఆకురసంతో నూరి ముద్దగా చేసి మూడు రోజులు వరుసగా నుదుటి మీద పట్టివేస్తే మైగ్రేన్‌ తగ్గుతుంది.

పొద్దుతిరుగుడు చెట్టు వేరును ఆవుపాలతో మెత్తగా రుబ్బి, రోజుకు రెండు పూటలా తులం చొప్పున వేసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

పది చుక్కల పొద్దు తిరుగుడు ఆకు రసాన్ని, పాలల్లో కలిపి తాగిస్తే పిల్లలకు వచ్చే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి బాధలు తగ్గుతాయి.పొద్దు తిరుగుడు ఆకులను పైన కట్టుకట్టి ఉంచితే, గడ్డలు వాపు తగ్గుతాయి.

100 మి.లీ. ఆకు ర సానికి 100 మి. లీ నువ్వుల నూనె చేర్చి, అందులో 25 గ్రాముల ఆకులను ముద్దగా నూరి వేసి తైలముగా కాచి ఆ తైలాన్ని చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. ఆకు రసానికి సమానంగా, త్రికటు చూర్ణం వేసి వెచ్చచేసి రెండు చుక్కలు చెవిలో వేస్తే, చెవిలోని ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

 పొద్దు తిరుగుడు వేరుకు సమానంగా, వెల్లుల్లి కలిపి, ముద్దగా నూరి, కంఠానికి పట్టీగా కట్టుకడితే గాయిటర్‌ తగ్గుతుంది.

 పొద్దు తిరుగుడు గింజల చూర్ణానికి సమానంగా, చక్కెర పొడి కలిపి 6 గ్రాముల మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే, అర్శమొలలు తగ్గుతాయి.

మూడు గ్రాముల గింజల చూర్ణాన్ని రెండు పూటలా సేవిస్తే కడుపులోని నులిపురుగులు నశిస్తాయి.