ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు

13-08-2018: కొబ్బరి నీళ్లు ఎండ నుంచి ఉపశమనం ఇవ్వడమేగాక అన్నికాలాల్లోనూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్న వారికి కొబ్బరి నీళ్లు ఔషధంగా పనిచేస్తాయి.
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు నీటిని, మలినాలను బయటకు పంపుతుంది.
కొబ్బరి నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సర్జరీ అయినవారికి, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి కొబ్బరి నీళ్లు బెస్ట్‌ డ్రింక్‌. రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి కావల్సిన లవణాలు, విటమిన్లు, ఎలక్రోలైట్లు అందుతాయి.
తరచూ కొబ్బరినీళ్లు తాగితే అసిడిటీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీర్ణాశయ పీహెచ్‌ సాధారణ స్థాయికి వస్తుంది. శరీరం కోల్పోయిన శక్తినీ, నీటిని తిరిగి పొందుతుంది.
కొబ్బరి నీళ్లలోని గుణాలు కిడ్నీలో రాళ్లను ముక్కలు చేస్తాయి. మూత్రపిండాలను సంరక్షిస్తాయి.
కొబ్బరి నీళ్లలో చక్కెర పాళ్లు చాలా తక్కువగా ఉంటాయి. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు కూడా వీటిని భేషుగ్గా తాగొచ్చు. రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి.