షుగర్‌ రోగులకు బాదంపుప్పుతో మేలు!

24-04-2019: షుగర్‌ రోగులు రోజుకు మూడు బాదంపప్పు గింజలు తింటే గుండెజబ్బులు రావని తాజా సర్వే పేర్కొంటోంది. కనీసం రోజుకు ఒక బాదంపప్పు గింజ తిన్నవారికంటే ఐదు బాదంపప్పు గింజలు తిన్న వారిలో 17శాతం తక్కువ ముప్పు గమనించినట్లు హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇదే కాదు మరణాల రేటు కూడా తగ్గుతుందని అంటున్నారు. ఈ మేరకు టైప్‌ 2 షుగర్‌తో బాధపడుతున్న 16217 మంది స్త్రీ, పురుషులను పరిశోధనకు ఎంచుకుని పరిశీలించారు.