పసుపుతో కేన్సర్‌కు చెక్‌!

24-04-2019: పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని మనకు తెలిసిందే! అయితే కేన్సర్‌ పని పట్టే శక్తి కూడా ఉన్నట్లు తాజా సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఉదర (స్టమక్‌) కేన్సర్‌ను నయం చేస్తుందని బ్రెజిల్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ సావో పౌలో, ఫెడరల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పారా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు పసుపులో ఉన్న అన్ని ఔషధ గుణాలపై పరిశోధన చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ వివరాలను ఎపిజినోమిక్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. సహజ సిద్ధమైన హిస్టోన్‌ చర్యల వల్ల ఈ రకమైన కేన్సర్‌ను నియంత్రించడంలోనూ, నయం చేయడంలోనూ పసుపు సమర్ధమంతంగా పనిచేస్తుందని తెలియజేశారు.