గురకను బట్టి మరణాన్ని పసిగట్టొచ్చు!

21-10-2018: గురక.. చాలామందిని వేధించే సమస్య. నిద్రిస్తున్న సమయంలో శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఈ సమస్య వస్తుంటుంది. ఈ తీవ్రత పెరిగే కొద్దీ ఇది అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా(ఓఎ్‌సఏ)గా మారుతుంది. అయితే ఈ ఓఎ్‌సఏను బట్టి ఒక వ్యక్తి మరణించే అవకాశాన్ని ముందుగానే గుర్తించవచ్చని ఓ పరిశోధనలో తేలింది. ఈ మేరకు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ రెస్పిరెటరీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌లో ఓ కథనం ప్రచురితమైంది.