ఆవులింత ఎందుకు అంటుకుంటుందో తెలిసింది!

02-09-2017: అలసిపోకున్నా పక్కన వాళ్లెవరైనా ఆవులిస్తే చాలు.. దానంతట అదే మనకూ అంటుకుంటుంది. దాని గురించి ఆలోచించినా క్షణాల్లో ఆవులింత వచ్చేస్తుంది. ఎందుకలా అవుతుందో ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆవులింతపై యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హమ్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా.. మెదడులో ఉండే చాలక వల్కలమే కారణమని తేలింది. ప్రకృతి పట్ల స్పందించి తదనుగుణంగా ప్రవర్తనలు కలగడం జీవులకున్న ప్రధాన లక్షణం. ముఖ్యంగా నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన జీవులు వ్యత్యాసాలకు అనుకూలంగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. అచ్చం అలాగే ఎదుటి వారికి ఆవులింత వచ్చినపుడు మెదడులో ఉండే ప్రాథమిక చాలక వల్కలం కూడా మనం ఆవులింత తీసేలా ప్రేరేపిస్తుందట.