చూయింగ్‌ గమ్‌తో శరీరానికి విటమిన్లు

12-10-2018: చూయింగ్‌ గమ్‌.. యువతకు ఇదో ఫ్యాషన్‌. నోట్లో వేసుకొని నములుతుంటే అదో టైం పాస్‌. శరీరానికి శక్తి అందించేందుకూ ఇది తోడ్పడుతుంది. విటమిన్లను శరీరానికి అందజేసేందుకు ఇది కీలకంగా ఉపయోగపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. విటమిన్‌ లోపాన్ని అధిగమించేందుకు అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు విటమిన్లు చేర్చిన చూయింగ్‌ గమ్‌లను కొంతమందికి అందజేసి పరీక్షించగా, అవసరమయ్యే స్థాయిలో శరీరానికి అందినట్లు గుర్తించారు.