విటమిన్‌ కే లోపంతో వృద్ధాప్యంలో ఇబ్బందే!

15-06-2019: శరీరంలో ‘విటమిన్‌ కే’ స్థాయి తగ్గడం వల్లే వృద్ధాప్యంలో ఉన్న వారు పరిమితంగా కదులుతారని తాజా సర్వే పేర్కొంది. క్రమంగా ఇది వైకల్యంగా మారే అవకాశం ఉందని తెలియజేసింది. ఈ వివరాలను జర్నల్‌ ఆఫ్‌ జెరోంటాలజీ-మెడికల్‌ సైన్స్‌’లో వెల్లడించారు. విటమిన్‌ కే స్థాయి తగ్గడం వల్ల ఒక్కోసారి తీవ్రమైన రోగాలకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో తగినంత పరిమాణంలో విటమిన్‌ కే ఉన్న వారితో పోల్చితే.. ఆ స్థాయి తక్కువ ఉన్నవారిలో శరీరం కదలలేని స్థితికి చేరుకోవడానికి ఒకటిన్నర నుంచి రెండురెట్ల ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు.