చిలగడదుంపతో ఎంతో మేలు

12-06-2019: అత్యంత రుచికరమైన చిరుతిండి ఏది అంటే చిలగడదుంప అంటారు. ఇందులో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, కాల్చుకునో, కూరగానో... ఏరకంగా తిన్నా కూడా ప్రయోజనమే. అందుకు కనీసం వారానికి రెండు సార్లయినా చిలగడదుంపను తినమని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. ఇందులో అనేక ఖనిజలవణాలతోపాటు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్‌ ఎ, బి, ఇ, డిలు ఉన్నాయి. కార్టినాయిడ్స్‌, పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు కూడా ఉన్నాయి. ఇంకా ఫైబర్‌ అధిక మోతాదులో ఉండటం వల్ల ఎసిడిటీ వంటి సమస్యల నివారణతోపాటు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఉడికించిన స్వీట్‌ పొటాటోను ఎదిగే పిల్లలకు తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలను బయటకు పంపిస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చిలగడదుంపలో ఉన్నాయి.