ఆరోగ్యం ‘వెలగంగ

ఆంధ్రజ్యోతి, 25-09-2017: బాగా పండిన వెలగ పండును నిప్పులో కాల్చి లోపలి గుజ్జును తీసి, దానికి కొంచెం శొంఠి, మిరియాల చూర్ణం కలిపి బఠాణీ గింజ అంత మాత్రలు చేసుకుని రోజూ పూటకు రెండు చొప్పున రెండు పూటలా వేసుకుంటే ఆకలి పెరుగుతుంది.

 కాయలోని గుజ్జులో పిప్పళ్ల పొడిని క లిపి చప్పరిస్తే వెక్కిళ్లు తగ్గుతాయి. వెక్కిళ్లు మరీ ఎక్కువగా ఉంటే, వెలగాకు రసానికి సమానంగా ఉసిరిక ఆకు రసాన్ని కలిపి అందులో పిప్పలి చూర్ణం, తేనె కలిపి ఇస్తే వెక్కిళ్లు తగ్గుతాయి.

 వెలగ గింజ చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి ఒక స్పూన్‌ మోతాదులో రోజూ రెండు పూటలా కొద్ది రోజులు వాడితే వీర్యవృద్ధి కలుగుతుంది.

 20 గ్రాముల వెలగ చెట్టు బెరడును దంచి రసం తీసి, కొద్ది రోజులు వాడితే కీళ్లనొప్పులు తగ్గుతాయి.

 3 స్పూన్ల వెలగ ఆకు రసంలో ఒక గ్రాము పిప్పలి చూర్ణం, తేనె కలిపి బాగా వాంతులు అవుతున్న వారికి తాగిస్తే వెంటనే తగ్గుతాయి.

 రెండు గ్రాముల వెలగ గింజల చూర్ణాన్ని నీళ్లలో కలిపి తాగిస్తే కడుపు నొప్పితో వచ్చే అజీర్ణ విరేచనాలు తగ్గుతాయి.