బాల్యంలో పారాసిటమాల్‌ వాడితే యుక్త వయసులో ఆస్తమా

18-09-2018: చిన్నారులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి పారాసిటమాల్‌ వేస్తున్నారా? అయితే వారు యుక్త వయసుకు చేరుకోగానే ఆస్తమా బారిన పడే ముప్పు అధికంగా ఉందని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. పారాసిటమాల్‌ వినియోగానికీ, ఆస్తమాకు మధ్య దృఢమైన సంబంధం ఉందని వివరించారు. సుమారు 620 మంది చిన్నారులను పరిశీలించారు.