కలల గురించి నమ్మలేని నిజాలు

22-10-2017: జీవితంలో కలలు గనడం.. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడమనేది సాధారణ విషయమే! అయితే నిద్రలో వచ్చే కొన్ని కలలు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతాయి. దీనికితోడు కలలపై లేనిపోని నమ్మకాలు ఏర్పరుచుకుంటాం. మానవ మస్తిష్కం రహస్యాలు తెలుసుకోవాలని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా వారు కలల గురించి కొన్ని విస్తుపోయే వాస్తవాలు తెలిపారు.
గురకపెట్టే సమయంలో కలలు రావు.
ఎవరైనా తమకు కలలు రావని చెబితే... వారు కలలను మరచిపోతున్నారని అర్థం.
సాధారణంగా ఒక వ్యక్తి రాత్రి నిద్రించే సమయంలో కనీసం నాలుగు కలలు కంటాడు.
ఎంతగుర్తుకు తెచ్చుకున్నప్పటికీ కల ఎక్కడి నుంచి మొదలైందనేది తెలియదట!
లేచిన వెంటనే సగం స్వప్నాన్ని, 10 నిమిషాల తరువాత 90శాతం స్వప్నాన్ని మరచిపోతామట.
అంధులకూ కలలు వస్తాయి. అయితే జన్మతహా అంథత్వం ఉన్నవారికి దృశ్యాలేవీ కనిపించవు.
చాలా వరకూ స్వప్నాల్లో ముఖం మాత్రమే కనిపిస్తుంది.
చాలా కలలు నెగిటివ్ ఫీలింగ్‌కు సంబంధించినవే అయి ఉంటాయి.
స్త్రీలకు, పురుషులకు కలలు వేర్వేరుగా ఉంటాయి. పురుషులకు ఇతర పురుషుల గురించి, స్త్రీలకు పురుషులు, మహిళలకు సంబంధించిన కలలు అధికంగా వస్తుంటాయి.