రోగి రక్తకణాలతోనే ‘క్రోన్స్‌’కు చికిత్స

17-02-2019: తాప జనక పేగు వ్యాధి(క్రోన్స్‌) జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. దీనిని ఉపేక్షిస్తే అతిసారం, అలసట, బరువు తగ్గడం వంటి ఇబ్బందులు పీడిస్తాయి. ఈ వ్యాధికి ఇదీ కారణం అని ప్రత్యేకంగా చెప్పలేం. అయితే చికిత్స విషయంలో సెయింట్‌ థామస్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బీఆర్‌సీ) పరిశోధకులు కొత్త సెల్‌ థెరపీని పరిచయం చేశారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి నుంచి తెల్లరక్తకణాలను సేకరించి.. శుద్ధి చేసిన కణాలను తిరిగి సిరల ద్వారా తిరిగి అతడి శరీరంలోకి ఎక్కించారు.ఈపరీక్షలు సత్ఫలితాలివ్వడం గమనార్హం.