తగ్గినా, పెరిగినా కష్టాలే!

19-01-2018: ఏడు గంటల నిద్ర ఎంతో ఉత్తమమని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో నొక్కిచెబుతున్నారు. అయితే చాలా మంది అంతకన్నా తక్కువ సమయమే నిద్రపోతున్నారు. తక్కువ గంటలు నిద్రపోయేవారిలో ప్రాణశక్తి, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయి తరుచూ రోగ గ్రస్తులవుతున్నారు. అయితే నిద్రా సమయం పెరిగినా సమస్యేనని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. నిద్రకు సంబంధించిన ఈ హెచ్చు తగ్గులు ఉన్నవారిలో మిగతా వారితో పోలిస్తే మరణాల రేటు 15 శాతం ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధ కులు కనుగొన్నారు. వీరిలో కొంత మంది డిప్రెషన్‌ లేదా స్లీప్‌ అప్నియా వంటి సమస్యలకు లోనవుతున్నారు. ఈ హెచ్చు తగ్గుల వెనుక ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం ప్రధాన కారణంగా పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తూ రోజూ 30 నిమిషాలకు మించి వ్యాయామం చేసే వారిలో ఈ నిద్రా సమస్యలు చాలా వరకు నియంత్రణలో ఉంటున్నట్లు అధ్యయనాల్లో బయటపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.