ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!

24-09-2017: ఏదైనా అతిగా తీసుకుంటే విషం అవుతుందంటారు. ఈ కోవలోనే కాఫీ అధికంగా తాగడం వలన కొన్ని అనర్థాలు పొంచివున్నాయి. కాఫీ మంచిదా? కాదా? అనే అంశంపై ఏళ్లతరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాగాగా వెల్లడైన వివరాల ప్రకారం అధికంగా కాఫీ తాగడం వలన శరీరంలో వివిధ మైక్రో మినరల్స్ గ్రహించే శక్తి తగ్గుతుంది. దీంతో మలబద్దకం లాంటి సమస్యలు తలెత్తవచ్చు, అంతేకాక ఉదరానికి సంబంధించిన ఇతరత్రా సమస్యలు కూడా తలెత్తుతాయి. కాఫీ.. శరీరాన్ని డీ హైడ్రేషన్‌కు గురిచేస్తుంది. నోటి దుర్వాసనకు ఆస్కారం కల్పిస్తుంది. ఉదయన్నే ఒక కప్పు కాఫీ తాగడం వలన బోవేల్ మూమెంట్స్‌ సులభతరం అవుతాయి. అయితే ఎక్కువగా కాఫీ తాగడం వలన శరీరానికి ఆహారాన్ని గ్రహించే కెపాసిటీ తగ్గిపోయి మెటబాలిజం తీరు దెబ్బతినే అవకాశం ఉంది. అధికంగా తీసుకునే కాఫీ వలన ఆహారమంతా చిన్నప్రేగు గుండా తొందరగా వెళ్లిపోతుంది. ఫలితంగా ఫుడ్‌లోని పోషకాలను శరీరం గ్రహించడంలో విపలం అవుతుంది. దీర్ఘకాలంలో దీనివల్ల పలు సమస్యలు రావొచ్చు. హోల్‌మిల్క్‌తో చేసిన కాఫీలు ఎక్కువగా తాగడం వలన, శరీరంలో కేలోరీల లోడ్ పెరుగుతుంది. పైగా కాఫీ‌లో రిఫైనడ్ షుగర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వివిధ భాగాలతో పాటు నడుము భాగంలో కొవ్వు పెరగడానికి కారణంగా మారుతుంది. అందుకే అధికంగా కాఫీ తాగేవారంతా కాస్త జాగ్రత్త వహించాల్సిందే!