సొంతంగా చికిత్స చేసుకునే ఈ-చర్మం

11-02-2018: స్వయంగా చికిత్స చేసుకునే, పునర్వినియోగానికి వీలైన కొత్తరకం ఎలకా్ట్రనిక్‌ చర్మాన్ని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒత్తిడి, ఉష్ణోగ్రత, తేమ, గాలి వంటి వాటిని గుర్తించేందుకు వీలుగా వీటిలో సెన్సర్లు కూడా అమర్చారు. రోబోటిక్స్‌, ప్రొస్థెటిక్‌ అభివృద్ధి నుంచి బయోపరికరాల అభివృద్ధి వరకు ఈ-చర్మాన్ని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ-చర్మం సున్నితంగా ఉండటం వల్ల మానవుల, రోబోటిక్‌ చేతుల తయారీలో సులువుగా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.