గర్భిణులు అలా పడుకోవడమే ఉత్తమం

12-06-2019: గర్భిణులు వెల్లకిలా పడుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు రక్తసరఫరా తగ్గుతుందనే విషయం అనేక పరిశోధనలు, అధ్యయనాల వల్ల తెలిసిన విషయమే! అంతేకాదు, అలా వెల్లకిలా పడుకోవడం వల్ల కడుపులోనే బిడ్డ చనిపోయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అందుకే గర్భిణులు పక్కకు తిరిగి పడుకుంటే మేలని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అంశంపై జరిగిన ఎన్నో అధ్యయనాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి కూడా. గర్భం ధరించాక 28 వారాల నుంచి వెల్లకిలా పడుకునేవారికి మృతశిశు జననం ముప్పు 2.6 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.  కాబట్టి 28 వారాల తర్వాత పక్కకు తిరిగి పడుకోవటమే మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. మృతశిశు జననానికి ఇతరత్రా కారణాలు ఉన్నా, ఇది కూడా పరిగణించవలసిన అంశమేనంటున్నారు వారు.