పచ్చసొనతో ఆరోగ్యం పదిలమే

11-11-2018: గుడ్డులోని పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తున్నారా? తినేప్పుడు దాన్ని పక్కన పడేస్తున్నారా? అది సరైంది కాదంటున్నారు నిపుణులు. తెల్లసొనలో ఉంటే ప్రొటీన్ల ఉంటాయో దానికి సమానమైన ప్రొటీన్లు పచ్చసొనలోనూ ఉంటాయంటున్నారు. గుడ్డులో ఉండే ఎమైనో ఆమ్లాల్లో సగం, కంటికి అత్యవరమైన రెండు కెరొటినాయిడ్స్‌ దీనిలోనే ఉంటాయి. గుడ్డులో ఉండే కాల్షియం, ఐరన్‌ మూలకాల్లో తెల్లసొన కంటే పచ్చసొనలోనే అధికంగా ఉంటాయి. కణాల పనితీరుకు అవసరమైన కొలీన్‌ కూడా పచ్చసొనలోనే ఉంటుంది.