‘ప్లస్‌ సైజ్‌’ పట్టించుకోకపోతే ప్రమాదం

24-06-2018: లావుగా ఉన్నా కొందరు శరీర ఆకృతి అందంగా కనిపించేందుకు తాపత్రయపడతారు. కానీ ఎంత బరువు పెరుగుతున్నామో.. బరువెంత ఉండాలో పట్టించుకోరు. ఫలితంగా అలాంటి వారిలో ఊబకాయ సమస్యలు ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలో తేలింది. ఇంకొందరైతే ప్లస్‌ సైజ్‌ శరీరాన్ని కనిపించకుండా దుస్తులు ధరిస్తారు. కానీ ఇలాంటి ప్రయత్నాల వల్ల ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలనే దృష్టి ఉండదట. యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఎంగ్లియా, ఆస్ట్రియాకు చెందిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అప్లయిడ్‌ సిస్టమ్స్‌ అనాలసిస్‌ ప్రతినిధులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.