చిత్తవైకల్యానికి ఆ జన్యు ప్రక్రియే కారణం

05-12-2018: చిత్త వైకల్యం లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణమైన జన్యు ప్రక్రియను యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ఏంజెల్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘టవ్‌’ అనే ప్రొటీన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవడమే ఈ సమస్యకు కారణంగా తెలుసుకున్నారు. ఈ దిశగా ఎలుకలపై ఆ జన్యు ప్రక్రియ ఆధారంగా పరీక్షలు చేశారు. దానిని నియంత్రించే ఔషధం ఉంటే చిత్తవైకల్యానికి ఆస్కారం ఉండబోదని చెబుతున్నారు.