కేన్సర్‌ కణాలను చంపే తేయాకు పిప్పి

22-05-2018: తేయాకు నుంచి తీసిన పిప్పితో విషరహితమైన క్వాంటమ్‌ డాట్స్‌ను తయారు చేయవచ్చని తమిళనాడుకు చెందిన కేఎస్‌ రంగస్వామి కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీ, భారతియార్‌ యూనివర్సిటీలతో కలిసి లండన్‌కు చెందిన స్వాన్సీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ క్వాంటమ్‌ డాట్స్‌ ఊపిరిత్తుల కేన్సర్‌ కణాలు పెరగకుండా 80ు వరకు అడ్డుకుంటాయని వారి అధ్యయనంలో తేలింది.