అంధత్వం నుంచి తప్పించే టీ!

17-01-2018: అంధత్వానికీ, టీకి ఏమిటి సంబంధం అన్న అనుమానం వస్తోంది కదూ...నిజమే ప్రతిరోజూ వేడి వేడి టీ తీసుకునే వారిలో గ్లకోమా(అంధత్వానికి దారితీసే కంటి వ్యాధి) వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయన్న విషయ ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. సుమారు 1400 మంది టీ కాఫీ తాగే అలవాట్ల మీద సుదీర్ఘ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరిలో చాలా మందికి కాఫీ, ఐస్‌ టీ తాగే అలవాటు ఉంది. మరికొంత మందికి వేడి వేడి టీ తాగే అలవాటు ఉంది. కాఫీ, చల్లని టీ తాగే వారిలో గ్లకోమా లక్షణాలు కనిపించగా, వేడి వేడి టీ తాగే వారిలో అవి కనిపించలేదు. వేడి టీ తాగడం వలనే వీరు గ్లకోమా నుంచి తప్పించుకోగలిగారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయం మీద అధ్యయనం నిర్వహించాల్సి ఉందని వారు అంటున్నారు.