టీనేజ్‌లో హింసకు టీవీనే కారణమా!

17-10-2018: దీనికి సమాధానం అవుననే అంటున్నారు పరిశోధకులు. మీడియాలో ప్రసారమవుతున్న హింసాత్మక సంఘటనలు టీనేజర్లలో దూకుడు స్వభావాన్నీ, వారిలో హింసను పెంచుతున్నాయని వారు చెబుతున్నారు. టీవీ దుష్ప్రభావంతో యువతరం హఠాత్తుగా క్షణికావేశానికి గురవుతోందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో 14 నుంచి 17 ఏళ్ల వయస్సుగల రెండువేల మంది టీనేజర్లపై జరిగిన సర్వేలో ఈ విషయాలు స్పష్టమయ్యాయి. యువతలో రోజురోజుకూ ఎక్కువ అవుతున్న ఈ సమస్యను పరిష్కరించాలంటే  తల్లిదండ్రుల సహకారం అవసరమని అమెరికాలోని అరెగాన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. టీనేజి పిల్లల మీద మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ, అందువలన వారు చూస్తున్న కార్యక్రమాలపై ఇంట్లో పెద్దలు కన్నేసి ఉంచాలంటున్నారు.. టీనేజీ పిల్లలు టీవీ, యాప్‌లు, ఫోన్‌లు వాడకుండా వారి దృష్టిని ఆటలు, ఇతర కార్యక్రమాల వైపు మళ్ళించాలని వారు సూచిస్తున్నారు.