గాయాన్ని మాన్పే చక్కెర

 

లండన్‌, నవంబరు 16: చక్కెర అనగానే మధుమేహ రోగుల్లో గుబులు. డాక్టర్లు కూడా వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు. అయితే, తాజా పరిశోధన ‘చక్కెర మంచిదే’నని చెబుతోంది. అన్ని రకాల చక్కెరలు ఆరోగ్యానికి హానికరం కాదని, కొన్ని రకాల చక్కెరలు గాయం మానడంలో తోడ్పడుతాయని వెల్లడిస్తోంది. రక్తనాళాలు ఏర్పడటంలో చక్కెర సాయపడుతుందని, తద్వారా మధుమేహం, వయసు రీత్యా తగ్గని గాయాలు మానడంలో పాత్ర వహిస్తుందని పాకిస్థాన్‌, యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌ పరిశోధకుల బృందం తెలిపింది.