ఉసిరి రసంతో ‘చక్కెర’ ఖతం

18-11-2018: ఉసిరి.. ఆయుర్వేద ఔషధం. దీనిలో విటమిన్‌ ‘సీ’ పుష్కలంగా దొరుకుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడంలో, బ్యాక్టీరియా, వైరస్‌ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది దివ్యౌషధమని తాజా అధ్యయనంలో తేలింది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఉసిరి ఉపయోగపడుతుందట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు ఉసిరిపై పరిశోధనలు చేయగా ఉసిరి రసం.. కార్బోహైడ్రేట్‌ జీవక్రియను మెరుగుపరిచి ఇన్సులిన్‌ సరిగా ఉత్పత్తి అయ్యేలా దోహదం చేస్తుందని వెల్లడైంది.