ప్రొటీన్లలతో బలంగా కండరాలు

03-09-2017: వయస్సు పెరిగే కొద్దీ శరీరం చైతన్యం కోల్పోయి, స్వంత పనులు కూడా చేసుకోవడానికి శక్తి ఉండదు. అయితే, రోజుకు మూడు సార్లు పుష్కలమైన ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే వృద్ధుల్లో కండరాలు బలంగా తయారవుతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఒకేసారి ప్రొటీన్లు తీసుకోవడం సాధారణమేనని, అదే సమయ పాలన పాటిస్తూ రోజూ మూడు పూటలా ప్రొటీన్లు తీసుకుంటే ఉక్కు మనిషిలా తయారవుతారని కెనడాలోని మెక్‌గిల్‌ వర్సిటీ హెల్త్‌ సెంటర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రియల్‌ పరిశోధకులు తెలిపారు.