సినిమాలతో వృద్ధుల్లో ఒత్తిడి దూరం!

15-12-2018: తరచుగా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడడం, మ్యూజియాలను సందర్శించడం వలన పెద్ద వయస్కుల్లో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయని బ్రిటన్‌లోని లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాంస్కృతిక అనుబంధంతో 50 ఏళ్లు పైబడిన వారిలో ఏర్పడే నిరాశ, మానసిక ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తగ్గుతాయని గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా 50 ఏళ్లు పైబడిన సుమారు 2 వేల మందిపై అధ్యయనం చేశారు. అందులో కొన్ని నెలలకోసారి సినిమాలు, ఎగ్జిబిషన్లు, మ్యూజియాలకు వెళ్లే వారికి మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం 32 శాతం తక్కువని గుర్తించారు.