లేటు నిద్రతో మెదడుకు మబ్బు

16-02-2019: త్వరగా నిద్రపోయి, సూర్యోదయం కాకముందే నిద్రలేవాలని పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. దానివల్ల ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటామట. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ల కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచే వాళ్ల మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. లేటుగా నిద్రపోయే వాళ్ల మెదడు మందగించి, రోజూవారీ పనుల్లో అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సర్రే శాస్త్రవేత్తలు తెలిపారు. చేసే పనుల్లో చురుకుతనం తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయని వెల్లడించారు.