ఇంత నిద్ర అవసరమే!

16-05-2018: పెద్దవారిలో కనిపించే పలురకాల ఆరోగ్యసమస్యలకు చిన్నతనంలోనే బీజం పడుతుందట! చిన్నపిల్లలు నిద్రపోయే సమయం తగ్గితే పెద్దయిన తరువాత వారిలో రకరకాల సమస్యలు ప్రారంభం కావచ్చు అంటున్నారు పరిశోధకులు. చిన్నతనంలో నిద్రలేమి పెద్దయ్యాక కూడా కొనసాగే అవకాశం ఉందట! పిల్లలు పుట్టినప్పటి నుంచీ మూడు సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల నిద్ర పోవాలి. మూడుసంవత్సరాలనుంచి ఆరుసంవత్సరాల వయస్సు వారికి రోజుకి పన్నెండు గంటలనిద్ర అవసరమవుతుంది. ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వారికి రోజుకి పది గంటల నిద్ర, టీనేజీలో ఉన్న వారికీ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర కావాలి. ఇన్ని గంటలసేపు నిద్రపోతేనే వారి మెదడూ, శరీరమూ ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు. ఈ విషయం మీద మూడుసంవత్సరాల నుంచి ముప్ఫై సంవత్సరాల వయస్సున్న కొందరి మీద పరిశోధకులు దీర్ఘకాలం అధ్యయనం చేశారు. చిన్నతనంలో నిద్రలేమి సమస్య ఎదుర్కొన్న చిన్నారులు పెద్ద అయిన తరువాత రకరకాల రుగ్మతల బారినపడడాన్ని వీరుగుర్తించారు.