ధూమపానం కంటే.. వాయుకాలుష్య మరణాలే ఎక్కువ

13-03-2019: ధూమపాన మరణాల కంటే.. వాయు కాలుష్య మృతుల సంఖ్యే అధికంగా ఉందా? అంటే ఔననే చెబుతున్నారు ఐరోపాకు చెందిన పరిశోధకులు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా 88 లక్షల మంది దుర్మరణం పాలవుతున్నారని.. ఈ సంఖ్య ధూమపానం వల్ల మృత్యువాత పడుతున్న వారికంటే (72 లక్షలు) అధికమన్నారు. వాయు కాలుష్యం వల్ల ఆయుర్దాయం 2.2 ఏళ్ల మేర తగ్గుతూ వస్తోందని చెప్పారు.