చర్మ కేన్సర్‌కు ప్యాచ్‌లతో చికిత్స

28-08-2019: చర్మ కేన్సర్‌ను నివారించడానికి మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సరికొత్త స్కిన్‌ ప్యాచ్‌లను తయారు చేశారు. ఇవి కేన్సర్‌ కణాలపై వేగంగా ప్రభావం చూపిస్తాయి. వీటిని ఉపయోగించడం అత్యంత సులభం. కేన్సర్‌ మచ్చలున్న చోట వీటిని అతికించుకొని ఒక నిమిషం తర్వాత తొలగిస్తే సరిపోతుంది. ‘‘మేం తయారు చేసిన స్కిన్‌ ప్యాచ్‌లలో ప్రత్యేకమైన రసాయనాలు ఉన్నాయి. వీటిని చర్మంపై అతికించుకొన్న ఒక నిమిషంలోనే తొలగించవచ్చు. ఈ రసాయనాలు కేన్సర్‌ కణాలపై అద్భుతంగా పోరాడతాయి’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.