యాంటీ బయాటిక్‌తో చర్మ కేన్సర్‌ అంతం

06-10-2018: ‘నిఫ్యురాక్సజైడ్‌’.. అతిసారం, పెద్ద పేగు నొప్పిని తగ్గించే ఈ యాంటీ బయాటిక్‌తో అత్యంత ప్రమాదకర చర్మ కేన్సర్‌ కణితులను కూడా అంతమొందించవచ్చని వెల్లడైంది. సాధారణంగా చర్మ కేన్సర్‌ కణితులు ‘ఆల్డెహైడ్‌ డీహైడ్రోజెనెస్‌1’ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తాయి. ఎంజైమ్‌ విడుదల కాగానే నిఫ్యురాక్సజైడ్‌ గుళిక మింగితే.. అది విషంగా మారి కేన్సర్‌ కణాలను చంపేస్తాయని వర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.