ఒత్తిడి తీవ్రతను.. ఉమ్మి చెబుతుంది

19-06-2018: పనిలో ఉన్నప్పుడు ఒత్తిడికి గురికావడం సహజమే. కానీ ఆఫీసు లేదా ఇంటి సమస్యలతో చాలామంది రోజులతరబడి ఒత్తిడి ఫీలవుతుంటారు. దీర్ఘకాలికంగా ఒత్తిడితో ఉంటే శరీరంలో కోర్టిసల్‌ హార్మోన్‌ స్థాయిలు విపరీతంగా పెరిగి ఏ చిన్న పని చేసినా తొందరగా అలసిపోతుంటారు. ఈ సమస్యను ముందే గుర్తించేందుకు సులువైన లాలాజల పరీక్షను వియన్నాకు చెందిన పరిశోధకులు కనిపెట్టారు. రోజులో వివిధ సమయాల్లో లాలాజల పరీక్షలు చేయడం ద్వారా కోరిస్టల్‌ హార్మోన్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.