పేగు కేన్సర్‌ను గుర్తించే రోబో!

21-06-2019: పెద్దపేగు లోపలి భాగాలను ఫొటో తీసి, ఏదైనా తేడా ఉంటే గుర్తించగలిగే చిన్న రొబోటిక్‌ క్యాప్సూల్‌ (మినీ రోబో)ను లండన్‌లోని లీడ్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు. కేన్సర్‌ వ్యాధిని గుర్తించడంలో అనుసరిస్తున్న ఎండోస్కోపీ, ఇతర నొప్పిభరిత విధానాల స్థానాన్ని ఈ మినీ రోబోలు భర్తీ చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ‘సోనోపిల్స్‌’గా పిలిచే వీటిని పెద్దపేగులోకి ప్రవేశపెడితే.. అది మైక్రో అల్ర్టాసౌండ్‌ ఇమేజ్‌లను చిత్రీకరిస్తుంది. దీంతో పేగులోని కొన్ని రకాల కణాల మార్పును, కేన్సర్‌ కణాల వృద్ధిని సులువుగా గుర్తించవచ్చని వర్సిటీ ప్రొఫెసర్‌ పీట్రో వాల్డాస్ర్తి తెలిపారు.