జన్యు లోపాలకు రోబో చికిత్స

19-01-2018: కొంతమంది శిశువుల్లో పుట్టుకతో వచ్చే అన్నవాహిక లోపాన్ని సరిచేసేందుకు శాస్త్రవేత్తలు ఒక ఇంప్లాంట్‌ రోబోను సృష్టించారు. అన్నవాహిక రంధ్రం మూసుకుపోతే పిల్లలు పాలు తాగడానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ సమయంలో ఈ రోబోను లోపల అమర్చితే.. సెన్సర్ల సాయంతో కణజాలాన్ని లాగి కణజాలాలు ఉత్తేజితమయ్యేలా చేస్తుంది. కణాలు ఉత్తేజితమైతే కణజాలం పెరిగి అన్నవాహిక రంధ్రం వెడల్పు అవుతుందన్న మాట. ఈ సరికొత్త రోబోను అమెరికాలోని బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు రూపొందించారు.