వెన్నెముక శస్త్రచికిత్స కోసం రోబో

28-08-2019: వెన్నెముక శస్త్రచికిత్సల కోసం ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ‘స్పైన్‌ సర్జరీ రోబో’ను తయారు చేశారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా చికిత్స చేయవచ్చని వారు తెలిపారు. వెన్నెముక శస్త్రచికిత్సలకు సంబంధించి ఇండియాలో ఇదే మొట్టమొదటి రోబోటిక్‌ విధానం. సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే దీనిలో రోగికి నొప్పి తక్కువ ఉంటుందని, ఇన్ఫెక్షన్‌లు కలుగవని చెప్పారు. ఉచ్ఛతార్‌ ఆవిష్కార్‌ యోజనలో భాగంగా ఈ ప్రాజెక్టుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులను సమకూర్చింది.