నడుము నొప్పిని తగ్గించే రోబో

11-10-2017: నడుము, మోకాళ్ల నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారా? మర్దన చేసే వాళ్లుంటే బాగుండు! అని అనిపించిందా? అయితే, మీకు మర్దన చేసి నడుము నొప్పిని తగ్గించే రోబో తొందర్లోనే అందుబాటులోకి రానుంది. సింగపూర్‌కు చెందిన ఐట్రీట్‌ స్టార్టప్‌ కంపెనీ మర్దన చేసేందుకే ప్రత్యేకంగా ‘ఎమ్మా’ అనే రోబోను అభివృద్ధి చేసింది. ఆ రోబో.. సెన్సర్లను ఉపయోగించుకుని కచ్చితమైన కండరాన్ని గుర్తిస్తుందని, ఎంత మర్దన చేస్తే రోగి నొప్పి నయం అవుతుందో కూడా అది తెలియజే స్తుందని నిపుణులు తెలిపారు. ‘ఎమ్మా’ మంగళవా రమే డాక్టర్లకు అందుబాటులోకి వచ్చిందని, శ్రామిక శక్తిని తగ్గించి, నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు.