తాకితే స్పందించే.. కృత్రిమ చర్మం

28-09-2019: అచ్చం నిజమైన చర్మంలా మృదువుగా ఉండటంతో పాటు ధరించే వ్యక్తి శరీరంలో ఇమిడిపోయే కృత్రిమ చర్మాన్ని స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. సిలికాన్‌, ఎలకో్ట్రడ్లతో తయారైన ఈ చర్మం కూడా స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంది. ఎవరైనా తాకగానే.. అందులోని సెన్సార్లు స్పందించి, ఆ సమాచారాన్ని వెంటనే దాన్ని ధరించిన వ్యక్తి వద్ద ఉండే మైక్రో కంట్రోలర్‌కు చేరవేస్తాయి. నరాలు, కండరాలు, ఎముకలు, కీళ్ల వ్యాధుల చికిత్సల్లో భాగంగా రోగుల శరీర భాగాల కచ్చితమైన కదలికలను తెలుసుకునేందుకు ఈ కృత్రిమ చర్మాన్ని వాడొచ్చని ఆవిష్కర్తలు తెలిపారు.