శ్వాసకోశ సమస్యలకు చెక్‌ పెట్టే వ్యాయామం

17-10-2017: ప్రాక్టీస్‌లోగాని, మ్యాచ్‌లోగాని ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సమయాల్లో వారికి శ్వాసకోశ సమస్యలు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే, వీటిని అధిగమించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త వ్యాయామ పద్ధతులను కనుగొన్నారు. వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాసనాళాల్లోకి చిన్న కెమేరాను పంపించి సమస్య ఎక్కడుందో గుర్తిస్తారు. తద్వారా అవసరమైన చికిత్సను, వ్యాయామాన్ని సూచిస్తారు. ఈఐఎల్‌ఓబి(ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూ్‌సడ్‌ లారింగేల్‌ అబ్‌స్ట్రక్షన్‌ బైఫాసిక్‌ ఇన్స్పిరేషనల్‌ టెక్నిక్స్‌)గా పిలిచే ఈ కొత్త పద్ధతితో ఆటగాళ్లు శ్వాసకోశ సమస్యలను అధిగమించొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.