రెటీనాతో హృద్రోగాల గుర్తింపు!

21-02-2018: గుండె సంబంధిత వ్యాధులను రక్త పరీక్షలు, ఎక్స్‌రే, ఎలకో్ట్రకార్డియోగ్రామ్‌(ఈసీజీ)తో గుర్తిస్తారు. వీటి అవసరం లేకుండా కేవలం కంటి రెటీనా చిత్రాలను ఉపయోగించి కచ్చితత్వంతో వ్యాధిని గుర్తించే కృత్రిమ మేధస్సును గూగుల్‌ అభివృద్ధి చేసింది. 2,84,335 మంది వ్యాధిగ్రస్తుల రెటీనా చిత్రాలను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఒక అల్గారిథంను రాసి ఈ సాంకేతికతను రూపొందించారు. ధూమపానం చేసే వారిని, చేయని వారిని కూడా ఈ అల్గారిథం 71శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుందట.