అల్జీమర్స్‌ను కనిపెట్టే ‘క్యూకో’

12-12-2017: మతిమరుపు వ్యాధి ‘డిమెన్షియా’నూ, అల్జీమర్స్‌నూ ముందుగానే కనిపెట్టగలిగే ఓ పరికరాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ వ్యాధులను సమూలంగా నయం చేసే చికిత్సలు లేకపోయినా ముందుగానే గుర్తించగలిగితే ఎక్కువ కాలం పాటు వాటిని వాయిదా వేయొచ్చు. ‘క్యూకో’ (కాగ్నిటివ్‌ కోషెంట్‌) అనే పరికరం సహాయంతో పిల్లలకు వాడే గ్రోత్‌ చార్ట్‌ తరహాలో క్యూకో చార్ట్‌ తయారు చేయొచ్చు. రోగి వయసు, విద్యార్హతల ఆధారంగా అతని కాగ్నిటివ్‌ పర్‌ఫార్మెన్స్‌ను అంచనా వేసి అల్జీమర్స్‌, డిమెన్షియా వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించవచ్చు. వ్యాధిని అదుపు చేయటానికి ఇలా ముందుగానే కనిపెట్టగలిగితే బ్రెయిన్‌ డ్యామేజ్‌ను ఆపవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.