కేన్సర్‌ను జయించిన మానసిక ఒత్తిడి

21-11-2017: కేన్సర్‌ ఉన్నపుడే శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. చికిత్సతో వ్యాధి అదుపులోకి వచ్చినా ప్రతి ఐదుగురిలో ఒకరికి ఆ ఒత్తిడి ప్రభావం అలాగే ఉంటుందట. దీన్నే ‘చికిత్సానంతర ఒత్తిడి (పీటీఎస్‌డీ)’ అంటారు. దీన్ని తొలి దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే వాళ్లు మరింత కుంగిపోయే ప్రమాదం ఉంటుందని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మలేసియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఏదేని ప్రమాదం వల్ల గానీ, ప్రకృతి విపత్తుల వల్ల ఏర్పడే పీటీఎస్‌డీ.. కేన్సర్‌ చికిత్స పొందుతున్న లేదా పొందిన వారిలోనూ తీవ్ర ప్రభావం చూపుతోందని వెల్లడించారు. చికిత్స పొందిన తర్వాత నుంచి ఆరు నెలల వరకు కేన్సర్‌ను జయించిన వాళ్లను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.