పేగుకేన్సర్‌ను ముందే చెప్పే ‘ప్రోటీన్‌’!

వాషింగ్టన్‌, జనవరి 8: పేగు కేన్సర్‌ను ముందే గుర్తించే ప్రోటీన్‌ను పరిశోధకులు తాజాగా గుర్తించారు. కణాల వ్యాప్తి, కొత్త రక్తనాళాల అభివృద్ధిలో బీటా-1, 4-గాలక్టోసిల్‌ట్రాన్స్‌ఫరస్‌ అనే ప్రోటీన్‌ భాగమైనట్లుగా అమెరికాలోని జాన్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకుల అధ్యయనంలో తెలిసింది. దీనివల్ల సాధారణ కణజాలంతో పోలిస్తే పేగు కేన్సర్‌ కారక కణజాలాలు ఎక్కువగా పెరుగుతాయని పరిశోధకులు వెల్లడించారు. పేగు కేన్సర్‌ను ముందుగా నిర్ధారించే బయోమార్కర్‌గా ఈ ప్రోటీన్‌ను పేర్కొన్నారు.